‘జూలీ-2’ ఘాటైన సీన్లు లీక్‌..! | Actress Raai Laxmi comment on julie 2 Leaked Scenes | Sakshi
Sakshi News home page

Nov 23 2017 7:09 PM | Updated on Nov 23 2017 7:09 PM

Actress Raai Laxmi comment on julie 2 Leaked Scenes - Sakshi

న్యూఢిల్లీ: రాయ్‌ లక్ష్మీ హీరోయిన్‌గా తెరకెక్కిన సినిమా ’జూలీ 2’.. మరో రెండురోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాలోని ఘాటైన సీన్లు సోషల్‌ మీడియాలో లీక్‌ అయ్యాయి.  ఓ హీరోయిన్‌ జీవితకథ ఆధారంగా తెరకెక్కినట్టు భావిస్తున్న ఈ సినిమాతో రాయ్‌లక్ష్మీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌లో, టీజర్‌లో రాయ్‌ లక్ష్మీ తన అందాలతో హీటెక్కింది. ఇప్పుడు ఈ సినిమాలో సహ నటుడితో సన్నిహితంగా ఉన్న ఘాటైన సీన్‌ లీకైంది. విడుదలకు ముందే సినిమాలోని సీన్లు లీక్‌ కావడంపై రాయ్‌లక్ష్మీ ఘాటుగా స్పందించింది. ఇలా చేయడం మూర్ఖత్వం అని పేర్కొంది.

‘నేను సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాను. సీన్లు లీకైన విషయం నాకు తెలియదు. సినిమా విడుదలకు ముందే ఎవరైనా సీన్లు లీక్ చేయడం మూర్ఖత్వం’ అని ఆమె పేర్కొన్నారు. ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు ఏ సర్టిఫికెట్‌ (పెద్దలకు మత్రమే) ఇచ్చింది. సెన్సార్‌ బోర్డు మాజీ చైర్మన్‌ పహ్లాజ్‌ నిహలానీ ఈ సినిమాను సమర్పిస్తుండటం గమనార్హం. గతంలో సినిమాల్లోని ఘాటు సీన్లకు, డైలాగులకు కత్తెరలు వేసి.. సంస్కారీ సెన్సార్‌ బోర్డు చైర్మన్‌గా పేరుతెచ్చుకున్న నిహలానే.. ఘాటైన ‘జూలీ 2’ సినిమాను ప్రమోట్‌ చేస్తుడటంపై బాలీవుడ్‌లో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ హీరోయిన్‌ నగ్మా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని కథనాలు రాగా.. అది పబ్లిసిటీ స్టంట్‌ మాత్రేనని నగ్మా కొట్టిపారేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement