చెట్టుకింద పెళ్లి చేసుకున్న హాలీవుడ్ భామ | Adams' wedding setting inspired by 'Forrest Gump' movie | Sakshi
Sakshi News home page

చెట్టుకింద పెళ్లి చేసుకున్న హాలీవుడ్ భామ

Published Mon, Mar 28 2016 9:21 AM | Last Updated on Wed, Apr 3 2019 9:04 PM

చెట్టుకింద పెళ్లి చేసుకున్న హాలీవుడ్ భామ - Sakshi

చెట్టుకింద పెళ్లి చేసుకున్న హాలీవుడ్ భామ

లండన్: తాను ఓ చెట్టుకింద పెళ్లి చేసుకున్నానని ప్రముఖ హాలీవుడ్ నటి ఆమీ అడమ్స్ చెప్పింది. అందుకు 'ఫారెస్ట్ గంప్' అనే హాలీవుడ్ చిత్రం స్ఫూర్తి అని తెలిపింది. 2015, మే నెలలో ఆడమ్స్ వివాహం హాలీవుడ్ నటుడు డారెన్ లి గాలోతో జరిగింది. వీరిద్దరు అంతకుముందు 2008 నుంచే సహజీవనం ప్రారంభించారు.

తన వివాహం గురించి ఆడమ్స్ మీడియాకు చెబుతూ.. 'ఫారెస్ట్ గంప్ అనే చిత్రాన్ని చూసిన తర్వాత నేను చెట్టుకిందే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అది నాకు చాలా ముఖ్యమైంది కూడా. నా బంధువులను, స్నేహితులను అందరిని ఆ చెట్టు కింద గుండ్రంగా కూర్చోబెట్టి అక్కడే పెళ్లి చేసుకున్నాను. తొలుత తన నిర్ణయం తెలుసుకున్నవారంతా గందరగోళం పడిపోయారు. ఆ సినిమా తనపై విపరీతంగా ప్రభావం చూపిందని అనుకున్నారు. కానీ, నాకు ఆ సమయంలో అలా పెళ్లి చేసుకోవడమే సరైనదని అనిపించింది' అని ఆమె చెప్పింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement