గూఢచారి ఎటు నీ గురి? | Adivi Sesh's Goodachari Title Design and Concept Poster Out, First | Sakshi
Sakshi News home page

గూఢచారి ఎటు నీ గురి?

Published Sun, Nov 5 2017 12:33 AM | Last Updated on Sun, Jul 14 2019 4:31 PM

Adivi Sesh's Goodachari Title Design and Concept Poster Out, First - Sakshi

గన్నులోంచి బుల్లెట్‌ బయటకొచ్చింది! బట్, అదెవరి మీదకు గురి పెట్టింది? అనేదే టాపిక్‌! ‘క్షణం’ వంటి సూపర్‌హిట్‌ తర్వాత అడివి శేష్‌ హీరోగా నటించిన సినిమా ‘గూఢచారి’. శనివారం ఈ సినిమా టైటిల్‌ లోగో, కాన్సెప్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. టైటిల్‌ కింద ‘త్రినేత్ర 116’ను క్యాప్షన్‌ టైపులో బార్‌కోడ్‌తో డిజైన్‌ చేశారు.

టైటిల్‌ అండ్‌ కాన్సెప్ట్‌ పోస్టర్‌ డిజైన్‌లోనే హీరో ‘స్పై’ క్యారెక్టర్‌ చేస్తున్నాడనేది క్లియర్‌! అయితే... గూఢచారి ఎవర్ని టార్గెట్‌ చేశాడనేది కథ! అదెప్పుడు చెబుతారో? శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో అభిషేక్‌ పిక్చర్స్, విస్టా డ్రీమ్‌ మర్చంట్స్, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో మాజీ మిస్‌ ఇండియా, తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ హీరోయిన్‌గా నటించారు. ‘‘హై టెక్నికల్‌ వేల్యూస్‌తో వంద రోజుల్లో సినిమా చిత్రీకరణ పూర్తి చేశాం.

వచ్చే ఏడాది వేసవిలో సినిమాను, ఈ డిసెంబర్‌ 17న సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేస్తాం’’ అని చిత్రనిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ డిజైన్‌: శివంరావ్, ఎడిటర్‌: గ్యారీ బీహెచ్, కెమెరా: షానిల్‌ డియో, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, కథ: అడివి శేష్, నిర్మాతలు: అభిషేక్‌ నామా, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement