చెర్రీతోనూ...ఐష్‌? | Aishwarya Rai Bachchan to star with Ram Charan in Mani Ratnam's | Sakshi
Sakshi News home page

చెర్రీతోనూ...ఐష్‌?

Published Sun, May 28 2017 12:03 AM | Last Updated on Tue, Sep 5 2017 12:09 PM

చెర్రీతోనూ...ఐష్‌?

చెర్రీతోనూ...ఐష్‌?

తండ్రి సినిమాలో కదా... ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ హీరోయిన్‌గా నటించే ఛాన్సుందని చెప్పారు. ఇప్పుడు కొడుకు పేరు చెబుతున్నారేంటి? అనుకుంటున్నారా!! డోంట్‌ గెట్‌ కన్‌ఫ్యూజ్డ్‌. చిరంజీవి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’లో హీరోయిన్‌గా ఐశ్వర్యను తీసుకోవాలనుకుంటున్నారు. డిస్కషన్స్‌ జరుగుతున్నాయి.

ఎట్‌ ద సేమ్‌ టైమ్‌... చరణ్‌కు జోడీగానూ ఐష్‌ను తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అప్పుడెప్పుడో మణిరత్నం దర్శకత్వంలో చరణ్‌ ఓ సినిమా చేస్తారని న్యూస్‌ వచ్చింది కదా! మణిరత్నం హైదరాబాద్‌ వచ్చి చెర్రీను కలిశారు కూడా.సేమ్‌ కథతో త్వరలో చెర్రీ–మణిలు సిన్మా చేయనున్నారట. ఇందులో ఐష్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలనేది మణిరత్నం ప్లాన్‌. చెర్రీ, ఐష్‌ పాత్రలు ఎలా ఉంటాయో! ఎందుకంటే... వయసులో ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది కదా.

ప్రస్తుతం చరణ్‌–మణిరత్నం–ఐశ్వర్యల మధ్య డిస్కషన్స్‌ జరుగుతున్నాయి, ఇంకా ఏదీ ఫైనలైజ్‌ కాలేదనేది చెన్నై టాక్‌.ఎవరైనా హాలిడేకి వెళితే ఎంజాయ్‌ చేస్తారు. రామ్‌చరణ్‌ అయితే హాలిడేలో ఎంజాయ్‌మెంట్‌తో పాటు వర్కవుట్స్‌ మిస్‌ కావడంలేదు. శుక్రవారం భార్య ఉపాసనతో కలసి ఏడు గంటలు మంచు కొండల్లో ట్రెకింగ్‌ చేశారు. ఫొటోతో సహా ఈ వార్తను ఉపాసన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement