స్పెయిన్‌లో యాక్షన్ | Akhil Akkineni Shooting In Spain! | Sakshi
Sakshi News home page

స్పెయిన్‌లో యాక్షన్

Published Tue, May 19 2015 11:25 PM | Last Updated on Sun, Sep 3 2017 2:19 AM

స్పెయిన్‌లో యాక్షన్

స్పెయిన్‌లో యాక్షన్

అది స్పెయిన్‌లోని మష్‌రూమ్ బిల్డింగ్. దాని మీద ఓ కుర్రాడు తనదైన శైలిలో వీర విహారం చేస్తున్నాడు.  ఆ దారిన వెళ్తున్న వాళ్లు సైతం ఆగి మరీ చూస్తున్నారు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరనుకుంటున్నారా? ఇంకెవరు... నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్. ఆయన హీరోగా, నితిన్ నిర్మాణంలో వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ ఘట్టాలను స్పెయిన్‌లో తీస్తున్నారు. దీని గురించి అఖిల్ ట్వీట్ చేశారు. స్టంట్ మాస్టర్ రవివర్మ నేతృత్వంలో ఈ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నామని, వినాయక్ వేగంగా యాక్షన్ సన్నివేశాలను తీస్తున్నారని అఖిల్ వివరించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement