
నాగచైతన్య
సిల్వర్ స్క్రీన్ పై తొలిసారి భయపెట్టడానికి రెడీ అవుతున్నారట నాగచైతన్య. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ చిత్రం చేస్తున్నారు చైతన్య. ఈ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారని తెలిసిందే. ఇది హారర్ థ్రిల్లర్ జానర్ లో ఉంటుందని తాజా సమాచారం. హారర్ బ్యాక్ డ్రాప్ లో చైతన్య ఇప్పటి వరకూ సినిమా చేయలేదు. ఇదే అతని తొలి హారర్ సినిమా అవుతుంది. ‘లవ్ స్టోరీ’ షూటింగ్ పూర్తి అయినా వెంటనే విక్రమ్ కుమార్ సినిమా మొదలుపెడతారు చైతన్య. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతన్య ‘మనం’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment