బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న నాగచైతన్య! | Naga Chaitanya To Make His Bollywood Debut With Aamir Khans Film | Sakshi
Sakshi News home page

అమీర్‌ఖాన్‌ చిత్రంలో చైతూ!

Published Tue, Jan 26 2021 12:36 PM | Last Updated on Tue, Jan 26 2021 4:36 PM

Naga Chaitanya To Make His Bollywood  Debut With Aamir Khans Film - Sakshi

యంగ్‌ హీరో అక్కినేని నాగచైతన్య బాలీవుడ్‌కి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్‌,రామ్‌చరణ్‌, రానా సహా పలువురు టాలీవుడ్‌ హీరోలు బీటౌన్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా ఆ జాబితాలోకి నాగ చైత‌న్య కూడా చేరున్నారు. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమీర్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దాలో ఓ కీలకమైన రోల్‌ కోసం చైతూని సంప్రదించారట. మొదట ఈ పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకోవాలని అనుకున్నప్పటికీ, డేట్స్‌ కుదరకపోవడంతో ఆ ఛాన్స్‌ నాగచైతన్యని వరించింది.  (పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన బాలీవుడ్‌ హీరో)

అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో సినిమాలో న‌టించే అవ‌కాశం రావ‌డంతో చైతూ కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. వచ్చేనెలలోనే చైతూ షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కరీనా కపూర్‌  నటిస్తుంది. మరోవైపు నాగచైతన్య లేటెస్ట్‌ మూవీ లవ్‌స్టోరి విడుదలకు సిద్ధంగా ఉంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చైతూకి జోడీగా సాయి పల్లవి నటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement