అంత అందంగా ఉన్నానా? | Am I that much beautiful, asks Nayanatara | Sakshi
Sakshi News home page

అంత అందంగా ఉన్నానా?

Published Thu, Sep 26 2013 9:49 AM | Last Updated on Fri, Sep 1 2017 11:04 PM

అంత అందంగా ఉన్నానా?

అంత అందంగా ఉన్నానా?

ఒక్కోసారి మన మనోబలం ఎంతనేది ఇతరులు చెబితేగానీ అర్థం కాదు. సరిగ్గా నయనతారకు ఇటీవల ఇలాంటి పరిస్థితే ఎదురైందట. నటిగా నయనతార ప్రతిభ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె రీ ఎంట్రీ తర్వాత ఆరంభం, రాజారాణి వరుసగా విడుదలకు ముస్తాబవుతున్నాయి. ఫలితాల కోసం నయన్‌ చాలా ఆతృతగా ఎదురు చూస్తోందట. ఈ రెండు చిత్రాల్లోనూ నయనతార అందం, అభినయం చాలా కొత్తగా ఉంటాయట.

ఈ విషయం చిత్ర యూనిట్‌ నోట విన్న నయనతార ఆనందంతో పొంగిపోతోందట. నిజంగా తాను అంత అందంగా ఉన్నానా అని అద్దంలో చూసి ప్రశ్నించుకుంటోందట. మరో విషయం ఏమిటంటే నయన్‌ సేవా కార్యక్రమాలపై దృష్టి సారించింది. అనేక అనాథ శరణాయాలకు వెళ్లి తగిన సాయం అందిస్తోంది. ఇది తాను మనస్ఫూర్తిగా, ఆత్మసంతృప్తి కోసం చేస్తున్న కార్యక్రమమని, బయట ఎక్కడా ప్రచారం చేయవద్దని సన్నిహితులతో చెబుతోందట. ఉన్నట్లుండి ఈ సాయం వెనుక రహస్యమేమైనా ఉందా అని కోలీవుడ్‌ ఆరా తీస్తోంది.

ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ల తదుపరి అడుగు రాజకీయ అరంగేట్రం అన్నట్లుగా మారింది కదా పరిస్థితి. ఇటీవలి హీరోయిన్ నమిత కూడా సామాజిక కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. అంతే కాకుండా త్వరలో రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తానని చెప్పింది. దాంతో ఎందుకైనా మంచిదని ముందుచూపుతో నమిత సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement