యాపిల్ రేటుకు ఐఫోన్ వస్తే....! | Anjali Sang song | Sakshi
Sakshi News home page

యాపిల్ రేటుకు ఐఫోన్ వస్తే....!

Published Wed, Mar 9 2016 11:23 PM | Last Updated on Mon, Aug 20 2018 2:58 PM

యాపిల్ రేటుకు ఐఫోన్ వస్తే....! - Sakshi

యాపిల్ రేటుకు ఐఫోన్ వస్తే....!

 కథానాయిక అంజలి కూడా సింగర్ అవతారమెత్తేశారు. ప్రస్తుతం ఆమె ‘చిత్రాంగద’ అనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నారు. ఆ చిత్రం కోసం ఆమె ఓ పాట పాడారు. ‘డ...డ... డాంగ్... డాంగ్... డంగ్ చుక్... డంగ్ చుక్ యాపిల్ సెల్‌ఫోన్... యాపిల్ రేటుకు వస్తే.... ఆషాఢం సేల్‌లో ఆడీ కారు గిఫ్ట్‌గా వస్తే...’ అంటూ పల్లవితో ఈ పాట సాగుతుంది.
 
  సెల్వ గణేశన్, స్వామినాథన్ సంగీత సారథ్యంలో అంజలి ఇటీవలే ఈ పాట రికార్డింగ్‌ను పూర్తి చేశారు. విశేషం ఏమిటంటే, ఈ పాట తమిళ వెర్షన్‌ను కూడా  అంజలి పాడారు. ‘పిల్ల జమిందార్’ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్, రెహమాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెలాఖరులో పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement