సెన్సార్ చిక్కుల్లో మరో సినిమా | Another Anurag Kashyap film faces trouble | Sakshi
Sakshi News home page

సెన్సార్ చిక్కుల్లో మరో సినిమా

Jun 19 2016 10:01 AM | Updated on Sep 4 2017 2:53 AM

ఉడ్తా పంజాబ్ సినిమా వివాదం మరువకముందే మరొక సినిమా సెన్సార్ కష్టాల్లో చిక్కుకుంది.

న్యూఢిల్లీ: ఉడ్తా పంజాబ్ సినిమా వివాదం మరువకముందే మరొక సినిమా  సెన్సార్ కష్టాల్లో చిక్కుకుంది. నవాజుద్దీన్ సిద్ధీఖీ ప్రధాన పాత్రలో నటించిన 'హరాంకోర్' సినిమాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్ సీ) సర్టిఫై చేయడానికి తిరస్కరించింది. టీచర్, స్టుడెంట్ మధ్య మితిమీరిన శృంగార సన్నివేశాలు ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

గుజరాత్ లోని చిన్న గ్రామంలో టీచర్ కు, టీనేజర్ విద్యార్థికి  మధ్య సాగే ఇతివృత్తం ఆధారంగా సినిమా సాగుతుంది. దీనికి శ్లోక్ శర్మ దర్శకత్వం వహించారు. సెన్సార్ బోర్డు తీరుపై చిత్ర నిర్మాత అనురాగ్ కశ్యప్ ట్రిబ్యునల్ ఆశ్రయించనున్నారు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement