సాక్షి, న్యూఢిల్లీ : దీపికా పదుకొనే నటించిన బాలీవుడ్ చిత్రం ‘ఛపాక్’పై మరో వివాదం చెల రేగింది. ఇందులో దీపిక నటించిన ‘మాలతీ’ పాత్రపై యాసిడ్ పోసిన వ్యక్తిని రాజేష్‌గా, అంటే హిందువుగా చూపించారన్నది కొత్త వివాదం. ఇదే నిజమైతే ఆ సినిమాపై కోర్టుకు వెళతామంటూ బీజేపీ ఎంపీల నుంచి బీజేపీ యువజన కార్యకర్తలు, సానుభూతిపరుల వరకు ట్వీట్ల ద్వారా స్పందించారు. జేఎన్‌యూలో దుండగులు జరిపిన దాడిలో గాయపడిన బాధితులను బుధవారం దీపికా పదుకొనే పరామర్శించడంపై వివాదం చెలరేగింది. దానిపై స్పందించిన బీజేపీ నాయకులు దీపికా పదుకునే నటించిన ‘ఛపాక్’ సినిమాను బహిష్కరించాలంటూ పిలుపునివ్వడం తెల్సిందే.
ఇప్పుడు అదే సినిమాపై ఈ కొత్త వివాదం రాజుకుంది. ఐఎండీబీ (ఇండియన్ మూవీ డేటా బేస్) వెబ్‌సైట్‌లో ఇచ్చిన పాత్రల పేర్ల ఆధారంగా దీపికా పాత్రపై యాసిడ్ పోసిన వ్యక్తిని రాజేష్‌గా చూపారన్నది వారి ఆరోపణ. దీనిపై లీగల్ చర్యలకు నోటీసు తయారు చేస్తున్నానని ఇష్కారన్ సింగ్ బండారీ అనే న్యాయవాది ట్వీట్ చేశారు. దీపికా పదుకునేతోపాటు ఆ సినిమా నిర్మాతలకు పంపించేందుకు ఇష్కారన్ లీగల్ నోటీసు తయారు చేస్తున్నారని బండారీని ఉద్దేశించి బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి ట్వీట్ చేశారు.
‘2005లో ఢిల్లీలోని ఖాన్ మార్కెట్‌లో మాలతీ అనే అమ్మాయిపై నదీమ్ ఖాన్ అనే ముస్లిం యువకుడు యాసిడ్ పోయగా... మాలతీగా దీపికా నటించిన ‘ఛపాక్’ లో నదీమ్ ఖాన్ పేరును రాజేష్‌గా మార్చారు. సెక్యులరిజం స్వరూపాన్ని రక్షించేందుకు ఇలా చేశారు’ అని బీజేపీ హర్యానా ఐటీ సెల్ హెడ్ అరుణ్ యాదవ్ ట్వీట్ చేశారు. జమ్మూ కశ్మీర్ బీజేపీ యువజన నాయకుడు, పార్టీ జాతీయ మీడియా ఇంచార్జీ రోహిత్ చహాల్ కూడా ఇదే ఆరోపణ చేశారు. నయీమ్ పేరును రాజేష్‌గా మార్చారంటూ బీజేపీ సానూకూల పత్రిక ‘స్వరాజ్య’ కూడా ఆరోపించింది. ‘నదీమ్ పేరును రాజేష్‌గా మార్చడం సెక్యులరిజమా, మీ సెక్కులరిజాన్ని తగలెయ్యా!’ అని నూపుర్ శర్మ అనే మరో బీజేపీ నాయకుడు వ్యాఖ్యానించారు.
ఇంతకు ఏది వాస్తవం?
ఒక్క ‘స్వరాజ్య’ పత్రిక తప్పా బీజేపీ నాయకులంతా నయీమ్ ఖాన్ పేరును నదీమ్ ఖాన్‌గా తప్పుగా పేర్కొన్నారు. సినిమాలో మాలతీ అనే అమ్మాయిపై యాసిడ్ పోసిన వ్యక్తిని నయీమ్ లేదా నదీమ్ లేదా రాజేష్‌గా చూపలేదని, బషీర్ ఖాన్‌గా చూపారని సినిమా ప్రివ్యూ చూసిన పలువురు మీడియా రిపోర్టర్లతోపాటు జాతీయ మహిళా కమిషనర్ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. రాజేష్ అన్న వ్యక్తి సినిమాలో మాలతీ స్నేహితుడని వారంతా చెప్పారు. అయితే ‘ఛపాక్’ బయోపిక్ చిత్రం అయినప్పుడు నయీమ్ పేరును బషీర్ ఖాన్‌గా మార్చాల్సిన అవసరం లేదని పలువురు క్రిటిక్స్ విమర్శించారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది.
‘ఛీ.. ఇంతకు దిగజారుతావా దీపిక’
వీధుల్లోకి రావడం బాగుంది: దీపిక
ఆ చూపులు మారాలి: హీరోయిన్
లక్ష్మీని ఓదార్చిన దీపిక!
లీటర్ యాసిడ్తో నాపై దాడి చేశాడు
అద్దంలో చూసుకొని వణికిపోయింది..
Comments
Please login to add a commentAdd a comment