మరో సలీమ్ వస్తాడు! - విజయ్ ఆంటోనీ | another saleem will come says vijay antony | Sakshi
Sakshi News home page

మరో సలీమ్ వస్తాడు! - విజయ్ ఆంటోనీ

Published Fri, Mar 13 2015 11:32 PM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM

మరో సలీమ్ వస్తాడు! - విజయ్ ఆంటోనీ

మరో సలీమ్ వస్తాడు! - విజయ్ ఆంటోనీ

సంగీత దర్శకునిగా తెలుగు, తమిళ భాషల్లో దాదాపు ముప్ఫయ్ చిత్రాలకు పాటలు స్వరపరచిన విజయ్ ఆంటోనీ హీరోగా నటించి, నిర్మించిన తొలి చిత్రం ‘నకిలీ’. ఈ చిత్రానికి కొనసాగింపుగా విజయ్ ఆంటోనీ చేసిన ‘డా. సలీమ్’ని అదే పేరుతో నాగప్రసాద్ సన్నితి సమర్పణలో  సురేశ్ కొండేటి, తమటం కుమార్‌రెడ్డి తెలుగులోకి అనువదించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించినట్లుగానే తెలుగులోనూ మంచి ఫలితాన్నిస్తుందనే నమ్మకం ఉందని విజయ్ ఆంటోనీ అన్నారు.

ఈ చిత్రకథానాయిక అక్ష, విజయ్ ఆంటోనీ శుక్రవారం ప్రత్యేకంగా పాత్రికేయులతో మాట్లాడారు.  విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ -‘‘సమాజంలో చాలామంది సలీమ్‌లు ఉంటారు. కానీ, సంఘ విద్రోహ శక్తులపై తిరగబడితే ఏమవుతుందో? అనే భయం వాళ్లను ఆ పని చేయనివ్వదు. సినిమాలు చూసి, ఉత్తేజితులవుతారనే లక్ష్యంతోనే నేను మంచి కథాంశాలు ఎన్నుకుంటున్నా’’ అన్నారు. ‘సలీమ్’కి కొనసాగింపుగా మూడో భాగం ఉంటుందని ఆయన వెల్లడించారు.

సినిమాలో సలీమ్ సమాజ సేవ చేస్తాడనీ, నిజజీవితంలో ఓ సంగీతదర్శకునిగా ఇప్పటివరకూ 60మంది గాయనీ గాయకులను పరిచయం చేశాననీ, నిర్మాతగా ఎంతోమంది నూతన సాంకేతిక నిపుణులకు, నటీనటులకు అవకాశం ఇస్తున్నాననీ, ఆర్థికంగా స్థిరపడితే సమాజ సేవ చేస్తాననీ విజయ్ ఆంటోనీ తెలిపారు. ఈ చిత్రంలో నటించడం పట్ల అక్ష ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement