అప్పుడు జేజెమ్మ ఇప్పుడు కృష్ణమ్మ | anushka first look in om namo venkateshaya movie | Sakshi
Sakshi News home page

అప్పుడు జేజెమ్మ ఇప్పుడు కృష్ణమ్మ

Published Sun, Aug 7 2016 4:38 AM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

అప్పుడు జేజెమ్మ ఇప్పుడు కృష్ణమ్మ

అప్పుడు జేజెమ్మ ఇప్పుడు కృష్ణమ్మ

ఆహార్యంలో ఆధ్యాత్మికం.. అలంకరణలో ఆకర్షణీయం.. కృష్ణమ్మగా అనుష్క రూపం కమనీయం అంటున్నారు నెటిజన్లు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్న ఆధ్యాత్మిక చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. అక్కినేని నాగార్జున హాథీరామ్ బాబాగా నటిస్తున్న ఈ చిత్రంలో అనుష్క మహా భక్తురాలు కృష్ణమ్మగా కనిపించనున్నారు. అరుంధతి, రుద్రమదేవి, దేవసేన పాత్రల తర్వాత అనుష్కకు అంత మంచి పేరు తీసుకొచ్చే పాత్ర ఇదని చిత్ర బృందం పేర్కొంది.

ఈ చిత్రంలోని కృష్ణమ్మ పాత్రకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ని శనివారం యూట్యూబ్‌లో విడుదల చేశారు. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. పతాకంపై ఏ.మహేశ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ప్రగ్యా జైశ్వాల్, సౌరభ్ జైన్, విమలా రామన్, అస్మిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: జే.కే.భారవి, ఛాయాగ్రహణం: ఎస్.గోపాల్‌రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement