తెలుగు తెరపై అనుష్కశర్మ?
తెలుగు తెరపై అనుష్కశర్మ?
Published Sat, Oct 12 2013 1:31 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
బాలీవుడ్ అందాలభామ అనుష్కశర్మ తెలుగులో నటించనుందా? అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ఇటీవలే ఓ అగ్ర నిర్మాత ఈ విషయమై అనుష్కను కలిసినట్లు సమాచారం. కథ, పారితోషికం, పాత్ర నచ్చడంతో అనుష్క కూడా సంతకం చేసేశారని తెలుస్తోంది. అనుష్క నటించబోయే తెలుగు సినిమా గురించి తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
‘రబ్‌నే బనాదేజోడీ’ చిత్రంతో తొలిసారి బాలీవుడ్ తెరపై మెరిశారు అనుష్కశర్మ. తొలి సినిమాతోనే షారుక్‌ఖాన్‌తో జోడీ కట్టి బాలీవుడ్‌లో అందరి దృష్టినీ ఆకర్షించారు. తొలి చిత్రంలో సంప్రదాయబద్ధంగా కనిపించిన ఈ అందాలభామ తర్వాత నటించిన ప్రతి సినిమాలోనూ హాట్‌గా కనిపించారు. తక్కువ సినిమాలతోనే బాలీవుడ్‌లో హాట్‌బ్యూటీగా పేరు గడించారు.
ప్రస్తుతం రణ్‌బీర్‌తో ‘బాంబే వెల్వెట్’, అమీర్‌ఖాన్‌తో ‘పీకే’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారామె. ‘పీకే’ చిత్రంలో అమీర్‌తో ఏడు నిమిషాల ముద్దు సన్నివేశంలో నటిస్తున్నట్లు ఓ వార్త ఇటీవలే హల్‌చల్ చేసింది కూడా. మరి ఈ బాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్‌లో ఎన్ని సంచలనలకు తెర లేపనుందో వేచి చూడాలి.
Advertisement
Advertisement