
రెస్ట్ తీసుకోనంటున్నారు రాఘవ. బ్రేక్ లేకుండా షూటింగ్ మీదే ఫుల్ ఫోకస్ పెడతారట. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై యస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లోని అల్యుమీనియం ఫ్యాక్టరీలో నేటి నుంచి షూటింగ్ స్టార్ట్ కానుంది. నెల రోజుల పాటు కంటిన్యూస్‌గా ఈ షెడ్యూల్ సాగుతుందని సమాచారం. బ్రేక్ లేకుండా ఈ షూటింగ్ తర్వగా కంప్లీట్ చేయాలని చిత్రబృందం భావిస్తోందట. ఇప్పటికే 30 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాను అక్టోబర్ 11న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: యస్.యస్.తమన్, కెమెరా: పీయస్ వినోద్.
Comments
Please login to add a commentAdd a comment