'నిజమైన రావణులను శిక్షించరెందుకు'
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సెలబ్రిటీలలో టాలీవుడ్ నటి, నిర్మాత రేణుదేశాయ్ ఒకరు. దేశంలో మహిళలు, ప్రస్తుత పరిస్థితులపై ఆమె పూర్తి అసంతృప్తితో ఉన్నట్లు ట్విట్టర్ పోస్ట్ ద్వారా తెలిపింది. మహిళలు, బాలికలపై దేశ వ్యాప్తంగా జరుగుతున్న అకృత్యాలపై ఆమె మండిపడ్డారు. భారతీయ సంప్రదాయాలను అనుసరించి ప్రతి ఏడాది రావణదహనం చేస్తుంటాం. కానీ దేశంలో మహిళలపై దురాగతాలకు పాల్పడుతున్న నిజమైన దుర్మార్గులను (రావణులను) శిక్షించడంలో ఎందుకు విఫలమవుతున్నామని ప్రశ్నించారు. నిర్భయ లాంటి ఘటనతో పాటు పన్నుల అంశంపై కొన్ని వ్యంగ్యాస్త్రాలను ఆమె పోస్ట్ చేశారు.
నిజాయతీగా కష్టపడి చేయడమే కాదు పన్నులను సకాలంలో చెల్లించాలన్నారు. మనం చెల్లించే సొమ్ములతో నేరాలకు పాల్పడే వాళ్లు హాయిగా జీవిస్తారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అత్యాచారాల విషయంలోనే కాదు ఏ ఇతర నేరాలకు పాల్పడిన వాళ్లను కఠినంగా శిక్షించాలని, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి ఉన్నట్లు కనిపించడం లేదని ట్విట్టర్ పోస్ట్ ద్వారా ఆమె అభిప్రాయపడ్డారు. 2012లో దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన నిర్భయ హత్యాచార ఘటనకు సంబంధించిన ఓ మైనర్ నిందితున్ని జువైనల్ హోమ్ నుంచి విడుదల చేయడాన్ని ఆపలేమని ఢిల్లీ కోర్టు శుక్రవారం వెల్లడించిన మరుసటి రోజే రేణుదేశాయ్ ఈ విధంగా తన అభిప్రాయాలను వెల్లడించారు.
As Indians we only burn d paper Ravan every year on Duserra but why r we,as society,incapable of punishing d real Ravans who rape? #nirbhaya
— renu (@renuudesai) December 19, 2015
You work hard&honest,pay ur taxes on time so that d ppl who commit crimes wil live comfortably on ur money dat u pay as taxes!Irony of life!
— renu (@renuudesai) December 19, 2015