ఆటోవాలా లవ్‌స్టోరీ | Auto Wala Love Story | Sakshi
Sakshi News home page

ఆటోవాలా లవ్‌స్టోరీ

Published Tue, Mar 10 2015 11:43 PM | Last Updated on Sat, Mar 9 2019 4:28 PM

ఆటోవాలా లవ్‌స్టోరీ - Sakshi

ఆటోవాలా లవ్‌స్టోరీ

ఆటో నడిపే అబ్బాయి, ఇంజినీరింగ్ చదివే అమ్మాయి ప్రేమలో పడితే ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘ ప్రేమ అంటే సులువు కాదురా..’ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్, సిమ్మిదాస్ జంటగా  భవనాసి రాంప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చందా గోవింద్‌రెడ్డి దర్శకుడు. చిత్రీకరణ  పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రేమలో పడటం సులువే కానీ నిలబెట్టుకోవడం కష్టం అనే  పాయింట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం.
 
 కథకథనాలు, సంభాషణలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. ఏప్రిల్‌లో  పాటలను, సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సురేశ్ రఘుట, సంగీతం: నందన్ రాజ్, సహ నిర్మాతలు: యన్. శ్రీరాములు-కె.సుధాకర్ రెడ్డి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement