చాలా ఇబ్బందిగా అనిపించింది!
పాల బుగ్గల సుందరి తమన్నా పోరాట దృశ్యాల్లో నటిస్తే ఎలా ఉంటారు? ఏమో ఎలా చెప్పగలం. ఇప్పటివరకూ ఆమె అలాంటి సన్నివేశాల్లో నటించిన దాఖలాలు లేవు. ఎంచక్కా ఆడుతూ, పాడుతూ సినిమాలు చేసిన ఈ బ్యూటీ ‘బాహుబలి’లో ఫైట్స్ కూడా చేశారు. అసలే సుకుమారి... ఇక ఫైట్స్ అంటే మాటలా? అందుకే ప్రభాస్‌తో కత్తి యుద్ధం చేయాలని చిత్రదర్శకుడు రాజమౌళి చెప్పగానే ఆమె భయపడిపోయారట. దాని గురించి తమన్నా చెబుతూ -‘‘కత్తి యుద్ధం మామూలు విషయం కాదు.
చాలా కష్టపడుతూనే ఈ సన్నివేశం చే శాను. నా ఇబ్బంది చూసి ప్రభాస్ నాకు హెల్ప్ చేశారు. ఇక, వాన జల్లు మధ్యే ఒక సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎప్పుడు ప్యాకప్ చెబుతారా? అని ఎదురు చూశాను’’ అని నవ్వేశారామె.ఆడియో ఆవిష్కరణ తిరుపతిలో..! కాగా, ఈ నెల 13న తిరుపతిలో ‘బాహుబలి’ పాటల ఆవిష్కరణ జరపనున్నట్లు యూనిట్ ప్రకటించింది. నిజానికి, మే ఆఖరులో హైదరా బాద్‌లో ఆడియో ఆవిష్కరణ జరపాలనుకున్నా, పోలీసు ఆంక్షలతో వాయిదాపడింది.