అయ్యప్ప మహిమలు
అయ్యప్ప స్వామి నేపథ్యంలో వీవీ నాయుడు నిర్మిస్తున్న చిత్రం ‘ఆపద్బాంధవుడు... అయ్యప్ప’. పెనుమర్తి విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మూడు పాటలు, కొంత టాకీ మినహా పూర్తయ్యింది. వేల్పుల వెంకటేశ్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రానికి కథ సమకూర్చడంతో పాటు పాటలు స్వరపరిచి, సాహిత్యం కూడా రాశాను.
ఈ నెలాఖరుతో షూటింగ్ ముగుస్తుంది’’ అన్నారు. ఇందులో తండ్రీ, కొడుకులుగా భానుచందర్ పోషిస్తున్న పాత్రలు హైలైట్‌గా నిలుస్తాయనీ, గురుస్వామి పాత్రను హేమసుందర్ చేస్తున్నారని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: కొత్తపల్లి బ్రదర్స్, సహనిర్మాత: నూకబోయిన వెంకట్రామ్.