బాహుబలి 3 ఉంటుంది | 'Baahubali 3' is on cards: SS Rajamouli | Sakshi
Sakshi News home page

బాహుబలి 3 ఉంటుంది

Published Mon, Oct 26 2015 12:40 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 AM

బాహుబలి 3 ఉంటుంది

బాహుబలి 3 ఉంటుంది

 ‘‘స్పష్టంగా చెప్పాల్సింది పోయి.. కన్‌ఫ్యూజ్ చేసినట్లున్నాను. క్షమించండి’’ అంటూ ఆదివారం ఉదయం దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ట్విట్టర్లో ఓ వార్త పోస్ట్ చేశారు. ‘బాహుబలి 2’కి కొనసాగింపుగా ఆయన మూడో భాగం తీస్తారనే వార్త శనివారం షికారు చేసింది. ‘‘మూడో భాగం తీయడం కోసం ‘బాహుబలి’ కథను పొడిగించం. రెండో భాగంతోనే ఆ కథ ముగుస్తుంది. పుకార్లను నమ్మొద్దు. ‘బాహుబలి’ ప్రయాణం మాత్రం కొనసాగుతుంది’’ అని ఆ వార్తకు ట్విట్టర్ ద్వారా సమాధానమిచ్చారు రాజమౌళి.
 
 దాంతో ‘బాహుబలి 3’ లేదట అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఈ చర్చ విని రాజమౌళి... ‘క్లారిటీగా చెప్పకుండా మరిన్ని సందేహాలు నెలకొనేలా చేసినట్లున్నాను’ అని ఆదివారం ట్వీట్ చేశారు. ‘‘రెండు భాగాలతోనే ‘బాహుబలి’ని ముగించేస్తాం. కానీ, ‘బాహుబలి 3’ ఉంటుంది. ఇప్పటివరకూ ప్రేక్షకులు చూడని విధంగా ఈ చిత్రం ఉంటుంది. ఓ అద్వితీయమైన అనుభూతికి గురి చేసే సరికొత్త కథతో ‘బాహుబలి 3’ రూపొందిస్తాం’’ అని రాజమౌళి స్పష్టం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement