ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది | 'Bajirao Mastani' changed my life forever: Ranveer Singh | Sakshi
Sakshi News home page

ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది

Published Mon, Dec 19 2016 3:35 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది - Sakshi

ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది

ముంబై: సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన చారిత్రక ప్రేమకథా చిత్రం బాజీరావ్‌ మస్తానీ తన జీవితాన్ని మార్చివేసిందని బాలీవుడ్‌ హీరో రణవీర్‌ సింగ్‌ అన్నాడు. ఈ సినిమా టైటిల్‌ రోల్‌లో రణవీర్‌ నటించిన సంగతి తెలిసిందే. అతనికి జోడీగా దీపికా పదుకోన్‌, ప్రియాంక చోప్రా నటించారు. గతేడాది డిసెంబర్‌ 18న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా రణవీర్‌ తన అనుభూతిని అభిమానులతో పంచుకుంటూ ట్వీట్‌ చేశాడు.

‘బాజీరావ్‌ మస్తానీ సినిమాలో మరాఠా వీరుడు బాజీరావ్‌ పాత్రలో నటించడం వల్ల నా జీవితం ఎంతో మారిపోయింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంజయ్‌ సర్‌కు కృతజ్ఞతలు. నాతో పాటు నటించిన దీపిక, ప్రియాంక, చిత్ర బృందానికి ధన్యవాదాలు’ అని రణవీర్‌ ట్వీట్‌ చేశాడు. హీరోయిన్లు దీపిక, ప్రియాంక కూడా దర్శకుడు సంజయ్‌ ఇతర యూనిట్‌కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement