
పూరి స్పీడు మామూలుగా లేదు..!
రోగ్ సినిమా తరువాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే
రోగ్ సినిమా తరువాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లిన ఈ సినిమా.. అప్పుడే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుందట.. అది కూడా ఏదో డైలాగ్ సీన్స్ కాదు సినిమాలో కీలకమైన ఓ యాక్షన్ సీక్వన్స్ను పూర్తి చేశారు పూరి, బాలయ్య. నమ్మటానికి కాస్త కష్టంగా ఉన్న పూరి స్పీడు తెలిసి వారు నిజమే అయి ఉంటుందంటున్నారు.
మార్చి 16న షూటింగ్ ప్రారంభించి పూరి ఆ రోజు బాలకృష్ణ ఎనర్జీ సూపర్బ్ అంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ చేసి వారం రోజులు కూడా గడవక ముందే మరో ట్వీట్ తో షాక్ ఇచ్చాడు. ' ఎన్బికె 101 ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. భారీ సెట్ లో యాక్షన్ సీక్వన్స్.. ఈ సీన్స్ అందరినీ అలరిస్తాయి' అంటూ ట్వీట్ చేశాడు. పూరి స్పీడు చూస్తుంటే నిజంగానే అనుకున్న సమయం కన్నా ముందే సినిమా పూర్తి చేసేలాగే ఉన్నాడు.
Completed my 1st schedule of #NBK101 in a massive set n action sequence .. it's gonna be feast for all #NandamuriBalakrishna fans 👍🏼👍🏼
— PURI JAGAN (@purijagan) 22 March 2017