![Balakrishna Speech At Basava Tarakam Cancer Hospital On Birthday Celebrations - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/10/balayya.jpg.webp?itok=36uvIwR1)
సాక్షి, హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ నేడు తన జన్మదిన వేడుకలను బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ ఆసుపత్రిలో పిల్లల మద్య జరిపారు. ఆయన తన 59వ పుట్టినరోజును క్యాన్సర్ బారిన పడిన పిల్లలు, ఆసుపత్రి బృందం మధ్య కేక్‌ను కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. తనకు అందరూ విష్ చేస్తున్నారని.. ‘అందరికీ వయసు పెరుగుతందని, కానీ తనకు తగ్గుతోందని చెప్పా’ అని అన్నారు. తనను ఆరకంగా విష్ చేయండని కోరారు. ఇక బాలయ్య తనదైన శైలిలో పద్యాలు చెబుతూ, మధ్యమధ్యలో తడబడుతూ అలా ప్రసంగించుకుంటూ వెళ్లారు. ఇక సినిమాల విషయానికొస్తే.. బాలయ్య తన 105వ సినిమాను కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment