
ఆ చిత్రాన్ని నిషేధించండి
చెన్నై : కాక్కముట్టై చిత్రాన్ని నిషేధించాలంటూ అఖిల భారత న్యాయవాదుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మణివన్నన్ శనివారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో 50మంది న్యావాదులతో కలిసి పిర్యాదు చేశారు. ఇద్దరు చిన్నారులు విఘ్నేశ్, రమేష్ ప్రదాన పాత్రల్లో నటించిన చిత్రం కాక్కముట్టై. ఈ బాల నటులిద్దరూ ఈ చిత్రంలో నటనకుగానూ జాతీయ అవార్డులను అందుకున్నారన్నది గమనార్హం. చిత్రం విడుదలై మూడు వారాలు కావస్తోంది.విశేష ప్రజాదరణతో ప్రదర్శింపబడుతున్న కాక్కముట్టై చిత్రానికి కర్ణాటక ప్రభుత్వం కూడ వినోదపు పన్నును రద్దు చేసింది.
ఇలాంటి చిత్రంపై ఇప్పుడు నిషేధం విధించాలంటూ న్యాయవాదుల సంఘం పోలీసులను ఆశ్రయించడం విశేషం. ఆ ఫిర్యాదులో వారు పేర్కొంటూ కాక్కముట్టై చిత్రంలో న్యాయవాదుల్ని కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు చోటు చేసుకున్నాయన్నారు. ఇదితమ మనోభావాల్ని దెబ్బ తీసే చర్యగా పేర్కోన్నారు. అంతేకాకుండా ప్రజల్లో న్యాయవాదులపై ఏహ్యాభావం కలిగించే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి చిత్రాన్ని వెంటనే నిషేధించాలని కోరారు.