వాస్తవ సంఘటన ఆధారంగా...
నల్లగొండలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన చిత్రం ‘మనసంతా నువ్వే’. పవన్, బిందు జంటగా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో పసుపులేటి దేవీచౌదరి నిర్మించారు. ర్యాప్ రాక్ షకీల్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుకలో దర్శకుడు మాట్లాడుతూ- ‘‘నేను అసిస్టెంట్‌గా ఉన్నప్పుడు నల్గొండకు షూటింగ్ వెళ్లా. అక్కడ నాకు ఎదురైన ఓ సంఘటనను కథగా మలుచుకుని నిర్మాతలను కలిశా. ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దాం’’ అన్నారు. ‘‘ప్రముఖ నటి పసుపులేటి కన్నాంబగారి మనవణ్ణి నేను. మంచి సినిమా తీశాం. షకీల్ సంగీతం బాగుంది. త్వరలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని సమర్పకుడు పసుపులేటి ప్రసన్నా చౌదరి అన్నారు.