బీచ్‌లో డేటింగ్! | Beach   Dating! | Sakshi
Sakshi News home page

బీచ్‌లో డేటింగ్!

Published Thu, Mar 20 2014 11:28 PM | Last Updated on Sat, Sep 2 2017 4:57 AM

బీచ్‌లో  డేటింగ్!

బీచ్‌లో డేటింగ్!

 సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ కనువిందుగా ఉంటాయి. అది కూడా సూర్యాస్తమయం సమయంలో ఏ సాగర తీరానో ఉంటే ఓ మంచి అనుభూతిని పొందవచ్చు. ఇలియానా కూడా ఇదే చెబుతున్నారు.


ఒకవేళ మీకు నచ్చిన వ్యక్తితో డేటింగ్ ప్లాన్ చేయాల్సి వస్తే, మీరు ఏ ప్లేస్‌ని ఎంపిక చేసుకుంటారు? అనే ప్రశ్న ఇలియానా ముందుంచితే -‘‘బీచ్‌ని మించిన బెస్ట్ ప్లేస్ ఉండదు. కాళ్లకు చెప్పుల్లేకుండా సాగర తీరంలో ఇసుకలో కూర్చుని ఎగసిపడే అలలను చూస్తుంటే చాలా బాగుంటుంది. అలాగే, ఇసుకలో నడుం వాల్చి, దుప్పటి కప్పేసుకుని సూర్యాస్తమయాన్ని తిలకిస్తే, ఆ హాయే వేరు. ఆ తర్వాత వేడి వేడి కాఫీ తాగుతూ, కబుర్లు చెప్పుకుంటుంటే ఎంత మజాగా ఉంటుందో’’ అన్నారు.


ఇంతకీ ఎవరితో డేటింగ్ చేస్తారు? అంటే.. అది మాత్రం సస్పెన్స్ అన్నట్లుగా ఇలియానా సైలైంట్ అయిపోయారు. పోనీ.. మీకు నచ్చిన వ్యక్తి ఎలా ఉండాలో చెబుతారా? అనడిగితే - ‘‘నిజాయతీపరుడై ఉండాలి. జీవిత భాగస్వామి మనోభావాలను గౌరవించాలి. చూడచక్కగా ఉండాలి. ఎప్పుడూ హ్యాపీగా నవ్వుతూ ఉండాలి’’ అన్నారు. బహుశా ఆండ్రూలో ఈ లక్షణాలన్నీ ఉండి ఉంటాయి. అందుకే అతనితో ప్రేమలో పడ్డారేమో. ఆండ్రూతో ప్రేమ గురించి ఇలియానా బాహాటంగా చెప్పకపోయినా.. ఈ ఇద్దరి మధ్య సమ్‌థింగ్ ఏదో ఉందని మాత్రం పరిశీలకులు భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement