అందమైన ప్రేమ ప్రయాణం... | Beautiful love affair | Sakshi
Sakshi News home page

అందమైన ప్రేమ ప్రయాణం...

Published Sat, May 24 2014 12:30 AM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

అందమైన ప్రేమ ప్రయాణం... - Sakshi

అందమైన ప్రేమ ప్రయాణం...

ఓ అమ్మాయి, ఓ అబ్బాయి ప్రేమలో పడతారు. వీరి ప్రేమ ప్రయాణం ఆహ్లాదంగా సాగుతుంది. ఆ ప్రయాణంలో వారు ఎలాంటి మధురానుభూతులు పొందుతారు? వీరి ప్రయాణంలో ఎవరెవరికి కీలక పాత్రలు ఉంటాయి? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘రారా కృష్ణయ్య’. సందీప్ కిషన్, రెజీనా జంటగా యస్వీకే సినిమా పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగపతిబాబు కీలక పాత్ర చేస్తున్న ఈ చిత్రం ద్వారా మహేశ్‌బాబు. పి దర్శకునిగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
 
 ఓ నవ్యమైన కథాంశంతో ఈ చిత్రం సాగుతుందని, ఈ నెల 28న ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలను, వచ్చే నెల చిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు. జగపతిబాబు పాత్ర హైలైట్‌గా నిలుస్తుందని, ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం హృదయానికి హత్తుకునే విధంగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీరామ్, సంగీతం: అచ్చు, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, ఆర్ట్: రామాంజనేయులు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement