
అమితాబ్, జాకీ చాన్‌ల సంచలన కలయిక
హిందీ-చీనీ భాయీ భాయీ అన్న మాట పాతదే అయినా, ఇప్పుడు సినిమాలకు సంబంధించినంత వరకు ఆ మాట కొత్తగా వినిపిస్తోంది. భారత, చైనాల మధ్య సినీ అనుబంధం వెల్లివిరిసే
హిందీ-చీనీ భాయీ భాయీ అన్న మాట పాతదే అయినా, ఇప్పుడు సినిమాలకు సంబంధించినంత వరకు ఆ మాట కొత్తగా వినిపిస్తోంది. భారత, చైనాల మధ్య సినీ అనుబంధం వెల్లివిరిసే అవకాశం కనిపిస్తోంది. తొలి ఇండో-చైనీస్ చలనచిత్ర రూపకల్పనకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది. ‘గోల్డ్ స్ట్రక్’ పేరిట రూపొందే ఈ చిత్రంలో భారత, చైనా సినీ పరిశ్రమలకు చెందిన దిగ్గజాలు పాల్గొంటారని విశ్వసనీయ వర్గాల భోగట్టా.
అదే గనక నిజమైతే, ఈ చిత్రంలో మన ‘బిగ్ బి’ అమితాబ్, చైనా సినీ సూపర్‌స్టార్ జాకీ చాన్‌లు కలసి వెండితెరను పంచుకోనున్నారు. ఆధునిక కాలానికి చెందిన సాహస గాథగా ఈ సినిమా రూపొందుతుందని సమాచారం. ఇందులో భారత, చైనాల సమున్నత సంస్కృతీ సంప్రదాయాలతో పాటు పునర్జన్మకు సంబంధించిన ఉంటుందట. అంతేకాక, ఈ చిత్రంలో అభయ్ డియోల్, అందాల నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లు కూడా నటించనున్నారు. అధికారిక ప్రకటన వెలువడాల్సిన ఈ చిత్ర వ్యవహారం అప్పుడే మన సినీ పరిశ్రమలో సంచలన వార్తగా మారింది.