బిగ్‌బాస్‌: గాయపడిన శివజ్యోతి | Bigg Boss 3 Telugu 12th Week Nomination Promo Shiva Jyothi Injured | Sakshi
Sakshi News home page

అలిగిన రాహుల్‌.. గాయపడ్డ శివజ్యోతి

Published Mon, Oct 7 2019 7:50 PM | Last Updated on Thu, Oct 10 2019 11:17 AM

Bigg Boss 3 Telugu 12th Week Nomination Promo Shiva Jyothi Injured - Sakshi

పన్నెండో వారానికి గాను నామినేషన్‌ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటివరకు విడుదలైన ప్రోమోల ప్రకారం నేటి ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా సాగేలా ఉంది. నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు ‘సేఫ్‌ పార్కింగ్‌’అనే టాస్క్‌ ఇచ్చాడు. దీనిలో భాగంగా ఎనిమింది మంది ఇంటిసభ్యులకు ఒక్కొక్కరికి ఒక్కో ట్రాలీ ఇచ్చి.. ఏడు పార్కింగ్‌ స్థలాలు మాత్రమే ఇచ్చాడు. అయితే సేఫ్‌గా పార్కింగ్‌ చేయలేని సభ్యులు ఈ వారం ఇంటి నుంచి బయటకి వెళ్లేందుకు నేరుగా నామినేట్‌ అవుతారు. అలా పార్కింగ్‌ స్థలాలను తగ్గిస్తూ ఉండటంతో.. ఒక్కొక్కరు నామినేట్‌ అవుతారు. ఇప్పటివరకు విడుదలైన ప్రోమోలను పరిశీలిస్తే వరుణ్‌, వితికా, మహేశ్‌ విట్టాలు నామినేట్‌ అయినట్లు తెలుస్తోంది. 

తొలి రౌండ్‌లోనే రాహుల్‌, మహేశ్‌లు ఓకే పార్కింగ్‌ స్థలంలోకి వెళ్లడానికి పోటీ పడ్డారు. అయితే మహేశ్‌ విఫలం కావడంతో నేరుగా నామినేట్‌ అయినట్లు తెలుస్తోంది. ఇక టాస్క్‌లో భాగంగా రాహుల్‌ సిప్లిగంజ్‌ కిందపడ్డాడు. దీంతో అలిగినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా బాబా భాస్కర్‌ కావాలనే కొంతమందిని అడ్డుకుంటున్నారని ఆయనపై అసహనం వ్యక్తం చేశాడు. అయితే బాబా భాస్కర్‌ తన స్టైల్‌లో సర్ధి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వర్కౌట్‌ కాలేదు.  కాగా, టాస్క్‌లో శివజ్యోతి కాలికి దెబ్బతగిలినట్టు తెలుస్తోంది. గాయంతో శివజ్యోతి విలవిలాడుతుండటంతో ఇంటిసభ్యులందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే అలీ రెజా వెంటనే శివజ్యోతిని ఎత్తుకొని కన్ఫెషన్‌ రూమ్‌కు తీసుకెళ్లాడు. దీంతో ఈ రోజు ఎపిసోడ్‌పై బిగ్‌బాస్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ వారం నామినేట్‌ అయ్యేది ఎవరో తెలుసుకోవాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement