
ఆరో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియపై గందరగోళ పరిస్థితి నెలకొంది. విదేశాల్లో ఉన్న నాగ్.. ఈ వీకెండ్‌కు అందుబాటులో లేకపోయేసరికి హోస్ట్‌గా రమ్యకృష్ణను బిగ్‌బాస్ బృందం రంగంలోకి దించింది. అయితే రమ్యకృష్ణ హోస్టింగ్‌పై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మరో వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఈ వారంలో ఎలిమినేషన్ ప్రక్రియ ఉండదనే రూమర్ వైరల్ అవుతోంది. ఈ వార్తపైనే నెటిజన్లు గుర్రుగా ఉన్నారు. వారం అంతా కష్టపడి ఓట్లు వేసిన ప్రేక్షకుల గురించి ఆలోచించరా.. ఆడియెన్స్ అంటే అంత చులకనా?, పనీపాటా లేకుండా ఓట్లు వేశామా? అంటూ బిగ్‌బాస్‌ను నిలదీస్తున్నారు. ఎలిమినేషన్ లేదంటే.. ఆ విషయాన్ని ముందుగానే ప్రేక్షకులకు తెలియజేయాలని, ఆడియన్స్‌ను గౌరవించడం తమిళ బిగ్‌బాస్‌ను చూసి నేర్చుకోవాలని చురకలంటిస్తున్నారు.
తమిళ బిగ్‌బాస్‌లో ఈ వారానికి గానూ ఎలిమినేషన్ ఉండదని, అయితే వారు నామినేషన్స్‌లో ఉంటారు.. ప్రేక్షకులు ఓట్లు వేయాల్సిన అవసరం లేదంటూ ముందుగానే సూచించారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిజంగానే ఒకవేళ రేపు ఎలిమినేషన్ ఉండకపోతే మాత్రం ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆరో వారానికి గానూ పునర్నవి, మహేష్, హిమజ నామినేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఆరో వారానికి సంబంధించి ఎలిమినేషన్ ఉంటుందా? లేదా అన్నది తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ ప్రసారమయ్యేవరకు ఆగాలి.
Comments
Please login to add a commentAdd a comment