శ్రీముఖికి షాక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌ | Bigg Boss 3 Telugu Nominations : Srimukhi Directly Nominated | Sakshi
Sakshi News home page

శ్రీముఖికి షాక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌

Published Mon, Sep 16 2019 5:21 PM | Last Updated on Mon, Sep 16 2019 5:50 PM

Bigg Boss 3 Telugu Nominations : Srimukhi Directly Nominated - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో.. నామినేషన్‌లో ఉండటం అనేది ఎంతటి వారికైనా కునుకు లేకుండా చేస్తుంది. హౌస్‌మేట్స్‌లో అప్పటి వరకు ఉన్న ప్రవర్తనకు భిన్నంగా మార్పులు కనిపిస్తాయి. అయితే అక్కడ ఇది నిరంతరం ప్రక్రియ. ప్రతీవారం నామినేషన్‌కు వెళ్లడం.. అదృష్టం ఉంటే ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకుంటారు లేదా నిష్క్రమిస్తారు. అయితే ఎలాంటి తప్పు చేయకుండా, నామినేషన్‌లో సరైన కారణాలు చెప్పకుండా నామినేట్‌ అయితే వారు మరింత బాధపడుతూ ఉంటారు.

ఈ సీజన్‌లో బిగ్‌బాస్‌ ఆగ్రహానికి గురై.. నేరుగా నామినేట్‌ అయిన వారున్నారు. గతంలో శివజ్యోతి, రోహిణి, శ్రీముఖిలను నేరుగా నామినేట్‌ చేశాడు. అయితే దురదృష్టం వెంటే ఉండటంతో రోహిణి ఎలిమినేట్‌ అయింది. టాస్క్‌లో క్రూరంగా ప్రవర్తించినందుకు శ్రీముఖిని నేరుగా నామినేట్‌ చేసేశాడు. అయితే లక్కు పక్కనే ఉండటంతో బతికిపోయింది. అయితే శ్రీముఖికి అలాంటి అనుభవమే మరోసారి ఎదురైనట్లు కనిపిస్తోంది.

తొమ్మిదో వారానికి గానూ నామినేషన్‌ ప్రక్రియను మొదలుపెట్టిన బిగ్‌బాస్‌.. గార్డెన్‌ ఏరియాలో టెలిఫోన్‌ బూత్‌ను ఏర్పాటు చేశాడు. అయితే అందులో ఉన్న ఫోన్‌ రింగ్‌ అవుతుండటంతో.. సంబరాన్ని ఆపుకోలేని శ్రీముఖి ఫోన్‌ను లిఫ్ట్‌ చేసింది. దీంతో శ్రీముఖిని బిగ్‌బాస్‌ మరోసారి నేరుగా నామినేట్‌ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈసారి అదృష్టం కలిసి వచ్చి సేవ్‌ అవుతుందా? అన్నది చూడాలి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement