
బిగ్‌బాస్ హౌస్‌లో రాహుల్ పునర్నవిలు ఎంత క్లోజ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. వీరిద్దరి వ్యవహారంపై సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ హల్‌చల్ చేస్తుంటాయి. ఇక వీరివురి మధ్య ప్రేమాయణం సాగుతోందన్న వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి. ఈ మూడో సీజన్‌లో రాహుల్-పునర్నవిల జంటే హైలెట్‌గా నిలుస్తోంది. ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం అనే టాస్క్‌లో పునర్నవి ప్రవర్తించిన తీరుపై కొందరు మద్దతు ప్రకటించగా.. మరికొందరు వ్యతిరేకించారు.
బిగ్‌బాస్‌కే ఎదురుతిరిగిన పునర్నవి నిన్నటి ఎపిసోడ్‌లో బాధపడుతూనే కనిపించింది. తాను బిగ్‌బాస్ ఇచ్చిన పనిష్మెంట్‌ను అంగీకరించబోనని, కావాలంటే ఈ కారణంతో తనను ఎలిమినేట్ చేసినా పర్లేదంటూ.. తన వాదనపై గట్టిగా నిలబడింది. ఈ వ్యవహారంలో రాహుల్ తనకు మద్దతు పలికినట్లు కనిపించలేదు. ఇదే కారణంతో పునర్నవి.. రాహుల్‌ను ఏడ్పించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
నవి.. నీ పెరుగు ఇవ్వొచ్చు కదా అని రాహుల్ అడగ్గా.. నా సర్వీసెస్ కట్ అయ్యాయ్.. సబ్‌స్క్రిప్షన్ ముగిసింది అని పునర్నవి బదులిచ్చింది. దీంట్లో వరుణ్ అమాయకత్వం ప్రదర్శిస్తూ.. సబ్‌స్క్రైబ్ చేయాలంటే ఏం చేయాలి బ్రో అని రాహుల్‌ను అడిగాడు. దీంతో రీచార్జ్ చేయాలి అంటూ రాహుల్ అనే సరికి.. ఎలా అలా అంటూ వరుణ్.. ఏం చేస్తావ్ అంటూ పునర్నవి ప్రశ్నించింది. మరి వీరిద్దరి మధ్య సేవలు మళ్లీ పునః ప్రారంభమయ్యాయో లేదో తెలియాలంటే నేటి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాలి.
Comments
Please login to add a commentAdd a comment