మర్ధానీ చిత్రం చూసి పాఠాలు నేర్చుకోండి!
మర్ధానీ చిత్రం చూసి పాఠాలు నేర్చుకోండి!
Published Wed, Aug 27 2014 2:00 PM | Last Updated on Thu, Jul 18 2019 2:02 PM
పాట్నా: బాలీవుడ్ తార రాణీ ముఖర్జీ నటించిన మర్ధానీ చిత్రం బీహార్ పోలీసులకు స్పూర్తిగా నిలిచింది. ఇటీవల విడుదలైన మర్దానీ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంటోంది. పోలీసులందరూ మర్ధానీ చిత్రం చూసి పాఠాలు నేర్చుకునేందుకు ఆ చిత్ర ప్రదర్శను బీహార్ లోని అన్ని జిల్లాల ఎస్పీలు, జీఆర్పీ ఎస్పీలు, బీహార్ మిలటరీ పోలీసు కమాండెంట్స్ లకు ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర సీఐడీ ఐజీ అరవింద్ పాండే ఆదేశించారు.
మర్ధానీ చిత్రం మహిళల అక్రమ రవాణా కథాంశంతో రూపొందించింది. మహిళల అక్రమ తరలింపు ప్రపంచవ్యాప్తంగా కీలక సమస్య మారింది. అవయవ, మహిళల, పసిపాపల అమ్మకాలు లాంటి నేరాలు పెరిగిపోతున్నాయి అని అరవింద్ పాండే ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అంశాలను చక్కగా తెరకెక్కించిన మర్ధానీ చిత్రాన్ని చూసి పోలీసులు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
Advertisement