కొడుకును కూడా ఫాలో కాని హీరో!! | birthday boy akkineni nagarjuna does not follow his sons | Sakshi
Sakshi News home page

కొడుకును కూడా ఫాలో కాని హీరో!!

Published Mon, Aug 29 2016 9:49 AM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

కొడుకును కూడా ఫాలో కాని హీరో!! - Sakshi

కొడుకును కూడా ఫాలో కాని హీరో!!

ఆయనకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరూ ఆయనకు అభిమానులే. సోషల్ మీడియాలో కూడా కొంత చురుగ్గానే ఉండే ఆ నవమన్మథుడు 56 ఏళ్లు నిండినా ఇప్పటికీ కుర్రహీరోలతో పోటీ పడతారు. వాళ్లతో కలిసి చిందేస్తారు. అవును.. ఆయనే నాగార్జున. 'కింగ్' పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను శుభాకాంక్షలతో ముంచెత్తారు.

ఇదే సందర్భంలో మరో విషయం కూడా బయటపడింది. ట్విట్టర్‌లో 16 లక్షల మందికి పైగా ఫాలోవర్లున్న నాగార్జున ఫాలో అయ్యేది మాత్రం ఇద్దరంటే ఇద్దరినే. వాళ్లలో ఆయన కొడుకులు అఖిల్, నాగచైతన్య కూడా లేరు. ఒకరు సచిన్ టెండూల్కర్, మరొకరు ప్రధాని నరేంద్ర మోదీ. కేవలం ఈ ఇద్దరిని మాత్రమే నాగార్జున ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారు. అమితాబ్ బచ్చన్‌కు కూడా మంచి ఫ్యాన్ అయిన నాగ్.. ఆయనను మాత్రం ఫాలో కాకపోవడం విశేషం. తన కొడుకులు సోషల్ మీడియాలో ఏం చెబుతున్నారన్న విషయాన్ని కూడా ఆయన పట్టించుకోవడం లేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement