బాంబే వెల్వెట్ ట్రైలర్ విడుదల | 'Bombay Velvet' trailer launched | Sakshi
Sakshi News home page

బాంబే వెల్వెట్ ట్రైలర్ విడుదల

Published Thu, Mar 19 2015 12:21 PM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM

'Bombay Velvet' trailer launched

ముంబై: ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్న బాలీవుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'బాంబే వెల్వెట్' సినిమా ట్రైలర్ అధికారికంగా విడుదలైంది. ఈ సినిమాలో మొట్టమొదటిసారి బాలీవుడ్ బబ్లీ హీరో రణ్ బీర్ కపూర్ యాక్షన్ హీరో పాత్ర పోషించాడు. ఈ సినిమాలో రణ్బీర్ జానీబాలరాజ్ అనే బాక్సర్ పాత్రలో నటించాడు. అనుష్క శర్మ రోజీ అనే గాయని పాత్రలో నటించింది. బాలీవుడ్ అగ్ర దర్శకుడు కరణ్ జోహార్ మొదటిసారి తెరపై కనిపించనున్నారు. ఆయన విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమాను చారిత్రాత్మక ఙ్నానప్రకాష్ రచించిన ముంబై ఫాబుల్స్ అనే రచన ఆధారంగా తెరకెక్కించారు.  అంతేకాకుండా ఈ సినిమాలో కేకే మీనన్, బాలీవుడ్ మాజీ నాయిక రవీనాటాండన్ నటించారు. 'బాంబే వెల్వెట్' సినిమా మే 15వ తేదీ విడుదలకు సిద్ధమైంది.     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement