కన్నడంలో బ్రహ్మానందం
కన్నడంలో బ్రహ్మానందం
Published Wed, Dec 11 2013 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
తెలుగు తెరపై తిరుగులేని హాస్యనటునిగా విరాజిల్లుతోన్న బ్రహ్మానందం ఇప్పుడు కన్నడంలోకి కూడా ఎంటరయ్యారు. పునీత్ రాజ్‌కుమార్ హీరోగా జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘నిన్నందలే’ చిత్రంలో ఆయన ముఖ్యపాత్ర పోషించారు. ఇప్పటివరకూ చాలా కన్నడ ఆఫర్లు వచ్చినా కూడా, తెలుగులో బిజీ కారణంగా బ్రహ్మానందం అంగీకరించలేదు. జయంత్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా బ్రహ్మానందం తొలిసారి కన్నడ చిత్రం చేయడానికి అంగీకరించారు.
ఇప్పటికే ఈ సినిమా 95 శాతం పూర్తయింది. త్వరలో ఈ చిత్రం పాటలను బెంగళూరులో మహేశ్‌బాబు చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారట. బ్రహ్మానందం మరోపక్క ఓ హిందీ చిత్రం కూడా అంగీకరించారు. గతంలో ఈవీవీ దర్శకత్వంలో ‘సూర్యవంశమ్’లో నటించిన బ్రహ్మానందంకు ఇది రెండో హిందీ సినిమా. 2007లో వచ్చిన ‘వెల్‌కమ్’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోన్న ‘వెల్‌కమ్ బ్యాక్’లో ఆయన దొంగ పాత్ర పోషిస్తున్నారు. నానాపటేకర్, అనిల్‌కపూర్‌ల కాంబినేషన్‌లో బ్రహ్మానందం సన్నివేశాలు ఉంటాయట. పాత్ర అమితంగా నచ్చడం వల్లనే చేస్తున్నానని బ్రహ్మానందం చెబుతున్నారు.
Advertisement
Advertisement