‘బాహుబలి’ ఎన్ని పార్టులుగా తీశారు? రెండు! చిత్రీకరణ ప్రారంభించిన కొన్ని రోజుల తర్వాత దర్శకుడు రాజమౌళి అండ్ కో రెండు పార్టులుగా తీస్తున్నట్టు చెప్పారు. హిందీలో ఈ సిన్మాను విడుదల చేసిన ప్రముఖ దర్శక–నిర్మాత కరణ్ జోహార్, మేం ఏమన్నా తక్కువా? అన్నట్టు 3 పార్టులుగా ఓ సినిమా (‘బ్రహ్మాస్త్ర’)ను తీస్తున్నట్టు ప్రకటించారు.
బిగ్ బి అమితాబ్ బచ్చన్, కపూర్స్ వారసుడు– యంగ్ హీరో రణబీర్, ఆలియా భట్ ముఖ్య తారలుగా నటించనున్న ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఫస్ట్ పార్టును 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తారట! ఈ దర్శకుడు రణబీర్‌కి క్లోజ్ ఫ్రెండ్. తనదీ ఫిల్మీ బ్యాగ్రౌండే. ఆల్రెడీ రణబీర్ హీరోగా ‘వేకప్ సిద్’, ‘యే జవానీ హై దివానీ’ సినిమాలు తీశారు.
ఇప్పుడు ఎలాంటి సినిమా తీయబోతున్నారో? స్నేహితుడు హీరోగా ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేసే సినిమా తీస్తారా? వెయిట్ అండ్ సీ!! హిందీలో హృతిక్ రోషన్ ‘క్రిష్’ ఫ్రాంచైజీలో మూడు సిన్మాలు వచ్చాయి. కానీ, ఒకటి హిటై్టన తర్వాత మరొకటి అనౌన్స్ చేశారు. షూటింగ్‌కి ముందే ఓ సినిమాను మూడు పార్టులుగా తీస్తున్నట్టు ప్రకటించడం ఇదే ఫస్ట్ టైమ్.
Comments
Please login to add a commentAdd a comment