ఓ చిన్ని బ్రేక్‌ | break to mahesh babau movie | Sakshi
Sakshi News home page

ఓ చిన్ని బ్రేక్‌

Published Wed, Dec 28 2016 11:00 PM | Last Updated on Mon, Aug 20 2018 3:40 PM

ఓ చిన్ని బ్రేక్‌ - Sakshi

ఓ చిన్ని బ్రేక్‌

కుదిరితే ఓసారి... వీలైతే రెండు మూడుసార్లు... ప్రతి ఏడాది ఫ్యామిలీతో మహేశ్‌బాబు విహార యాత్రలకు వెళతారు. ఇప్పుడు కూడా ఆయన విదేశాల్లోనే ఉన్నారట. షూటింగ్‌కి చిన్ని బ్రేక్‌ చెప్పి, భార్యాపిల్లలు నమ్రతా శిరోద్కర్, గౌతమ్, సితారలతో పాటు బావ గల్లా జయదేవ్‌ తదితర కుటుంబ సభ్యులతో స్విట్జర్లాండ్‌లోని జురిచ్‌ నగరంలో క్రిస్మస్‌ పండగను సెలబ్రేట్‌ చేసుకున్నారు. కొత్త సంవత్సర వేడుకలనూ మహేశ్‌ ఫ్యామిలీ విదేశాల్లోనే జరుపుకోనున్నారని సమాచారం. ఈ సెలవులు పూర్తయిన తర్వాత జనవరి మొదటివారంలో మహేశ్‌బాబు హైదరాబాద్‌ రానున్నారట.

ఆ తర్వాత ఏ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కొత్త షెడ్యూల్‌ ప్రారంభించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ‘ఠాగూర్‌’ మధు, ఎన్వీ ప్రసాద్‌లు నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేశ్‌ ఇంటిలిజెంట్‌ బ్యూరో ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ జరిపిన షూటింగ్‌తో 70 శాతం చిత్రీకరణ పూర్తయిందని యూనిట్‌ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. జనవరి 7న హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఫిబ్రవరిలో పాటల చిత్రీకరణకు విదేశాలు వెళ్లాలనుకుంటున్నారు. మధ్యలో ముంబయ్, పూణెలలోనూ కొన్ని రోజులు షూటింగ్‌ చేయనున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ‘సంభవామి’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. జనవరిలో టైటిల్‌ ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement