
కెమెరామన్ అమర్ మృతి
ఛాయాగ్రాహకుడు అమర్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ భోజ్‌పురి సినిమా షూటింగ్‌లో అనుకోకుండా విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. నెల్లూరు జిల్లా ముత్తకూరు ఆయన స్వస్థలం. అమర్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మోహన్‌బాబు నటించిన ‘శివ్‌శంకర్’, శ్రీకాంత్ ‘ప్రేమసందడి’, తనీష్ ‘బ్యాండ్‌బాజా’ తదితర చిత్రాలకు ఛాయాగ్రహణం అందించారాయన.