
భోజ్‌పురి నటి మనీషా రాయ్.. బైక్ యాక్సిడెంట్ ప్రతీకాత్మక చిత్రం
లక్నో: రోడ్డు ప్రమాదంలో నటి దుర్మరణం పాలైన ఘటన యూపీలో చోటు చేసుకుంది. భోజ్‌పురి నటి మనీషా రాయ్(45) శనివారం మృతి చెందారు. బల్లియాలోని చిట్టౌని గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఖోబర్ అనే లఘు చిత్రం ద్వారా మనీషా పాపులర్ అయ్యారు.
సహనటుడు సంజీవ్ మిశ్రాతో కలిసి ఆమె మోటర్ సైకిల్‌పై షూటింగ్‌కు వెళ్తున్నారు. ఆ సమయంలో వెనుకాల నుంచి ఓ కారు వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ మనీషా ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మిశ్రాకు గాయాలు కాగా, ఆయన్ని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు స్థానిక పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. పలు టీవీ సీరియళ్లతోపాటు చిత్రాల్లోనూ ఆమె నటించారు. మనీషా మృతి పట్ల భోజ్‌పురి చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment