సినీ తారల క్రికెట్ | celebitity cricket club | Sakshi
Sakshi News home page

సినీ తారల క్రికెట్

Published Sat, Feb 1 2014 12:00 AM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

సినీ తారల క్రికెట్ - Sakshi

సినీ తారల క్రికెట్


సినీ తారల క్రికెట్ సందడి మొదలైంది. తారలు వెండి తెర నుంచి క్రికెట్ పిచ్‌పైకి వచ్చారు. ఈ సీసీఎల్ టోర్నమెంట్ వారం క్రితం ముంబైలో మొదలైంది. రే పు బెంగళూరులో జరగబోయే మ్యాచ్‌లో చెన్నై తారల టీం పాల్గొంటోంది. దీనికి త్రిష అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
 ఆటయినా, పాటయినా ఆ మాట కొస్తే ఏ క్రీడయినా సై అంటోంది సీసీఎల్‌లోని చెన్నై రైనోస్ టీమ్. సినిమా, క్రీడలు ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. వీటి నుంచి ప్రేక్షకులు కోరుకునేది ఎంటర్ టెయిన్‌మెంట్. క్రీడల్లో హాకీ మన జాతీయ క్రీడ కంటే క్రికెట్ అంటేనే ఎక్కువ క్రేజ్. ఈ క్రీడకు సాధారణ ప్రేక్షకుడితోపాటు ప్రముఖ స్థాయికి చెందిన వారు ఎడిక్ట్ అనే చెప్పాలి. అశేష అభిమానులు ప్రేమించే సినీ కళాకారులు కూడా క్రికెట్ ప్రియులే. అలాంటి తారలు క్రీడాకారులయితే అయితే ఆ మజానే వారు. అలా పుట్టిందే క్రికెట్ సెలబ్రెటీస్ లీగ్ (సీసీఎల్) 2011లో నాలుగు భాషలకు చెందిన (తమిళం, తెలుగు, ముంబై, కర్ణాటక) టీమ్స్‌తో మొదలైన ఈ క్రికెట్  సెలబ్రెటీ లీగ్ ఒక్కో ఏడాది ఒక నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఐపీఎల్‌కు దీటుగా తయారైందంటే అతిశయోక్తి కాదు. చెన్నై రైనోస్ టీమ్‌కు విశాల్ కెప్టెన్సీ బాధ్యతలను నిర్వహిస్తుండగా, విక్రాంత్, రమణ, విష్ణు, శాంతను, శ్యామ్, జిత్తన్ రమేష్, జీవా, శ్రీకాంత్, సుందరం తదితరులు టీమ్ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు వారియర్స్‌కు నటుడు వెంకటేష్ నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ జట్టులో శ్రీకాంత్, అల్లరి నరేష్, అఖిల్ తదితరులు ఆడుతున్నారు. ముంబై హీరోస్ జట్టుకు నటుడు సునిల్ శెట్టి, కర్ణాటక బుల్డోజర్స్ జట్టుకు సుదీప్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
 
 ఇంతింతై - వటుడింతైనట్లు
 2011లో చెన్నై రైనోస్, తెలుగు వారియర్స్, కర్ణాటక బుల్డోజర్స్, ముంబై హీరోస్ టీమ్‌లుగా బరిలోకి దిగి, క్రికెట్, సినీ అభిమానుల్ని అలరించాయి. ఈ లీగ్‌లో చెన్నై రైనోస్ విజేతగా నిలిచింది. 2012లో జరిగిన రెండవ సీజన్‌లో ఈ నాలుగు టీమ్‌లకు మరో రెండు కేరళ స్ట్రైకర్స్, బెంగాల్ టైగర్స్ అదనంగా వచ్చి చేరాయి. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లోనూ కప్‌ను చెన్నై రైనోస్‌నే కైవసం చేసుకోవడం విశేషం. 2013లో జరిగిన మూడవ సీజన్‌లో మరో రెండు టీమ్‌లు వీర మరాఠి, బోజ్‌పూరి డేబాగ్స్ వచ్చి చేరాయి. ఈ సిరీస్ కప్‌ను కర్ణాటక బుల్డోజర్స్ తన్నుకుపోయింది.
 
 నాలుగు సీజన్ ఆట మొదలైంది
 నాలుగో సీజన్ సీసీఎల్ ఆటలో కప్ ఎవరిదన్నపై ఎవరికి వారే తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్ ఆట జనవరి 25న ముంబాయిలో మొదలైంది. మలి ఆట రేపు (ఆదివారం) బెంగుళూర్‌లోని చిన్నసామి స్టేడియంలో ప్రారం భం కానుంది. ఆ రోజున నాలుగు జట్లు తలపడబోతున్నాయి. సాయంత్రం 7 గంటలకు మొదల య్యే ఆటలో చెన్నై రైనోస్, కర్ణాటక బుల్డోజర్స్‌తో తలపడనుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో విజ యాన్ని కైవసం చేసుకున్న చెన్నై రైనోస్ మంచి రైజింగ్‌లో ఉంది. నాలుగో సీజన్ కప్ తామే సాధించి తీరుతామనే ధీమాను వ్యక్తం చేస్తోంది. ఈ టీమ్‌కు తాజాగా నటి త్రిష బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం విశేషం. టీమ్ కెప్టెన్ విశాల్ శుక్రవారం చెన్నైలో మీడియూతో మాట్లాడుతూ తమ టీమ్‌లో  యూనిటీ ఉందన్నారు. తమ టీమ్‌కు సంతోష్ గోపి కోచ్‌గా వ్యవహరించ డం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మూడు సీజన్ మ్యాచ్‌ల్లో ప్రతిభ ఆధారంగా ఈ లీగ్‌కు చాలా మార్పులు చేర్పు లు చేసుకున్నామని తెలిపారు. తమ టీమ్‌లో ప్రతి ఒక్కరూ కప్ గెలవాలన్న లక్ష్యంతోనే ఉన్నట్టు మళ్లీ విజేతగా నిలుస్తామనే నమ్మకంతో ఆడుతున్నట్లు తెలిపారు.
 
 ఆనందంగా ఉంది
 చెన్నై రైనోస్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం ఆనందంగా ఉందని నటి త్రిష పేర్కొన్నారు. తొలి సీజన్ నుంచి ఈ జట్టును ఉత్సాహపరచాలని కాంక్షించానని ఇప్పటికి అది నెరవేరిందని తెలిపారు. చెన్నై రైనోస్ టీమ్ చాలా పటిష్ఠంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
 చెన్నై అభిమానులకు నిరాశే
 ఈ సీసీఎల్ పోటీ ఫిబ్రవరి 2న చెన్నై చేపాక్ స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే ప్రభుత్వానికి క్రికెట్ బోర్డుకు మధ్య విభేదాలతో సీసీఎల్ పోటీకి అనుమతి లభించలేదని కెప్టెన్ విశాల్ తెలిపారు. దీంతో చెన్నైలో సీసీఎల్ మ్యాచ్ లేనట్లేనని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement