మెగాస్టార్ జుంబా డ్యాన్స్ | chiranjeevi practicing zumba Dance for 150th film | Sakshi
Sakshi News home page

మెగాస్టార్ జుంబా డ్యాన్స్

Published Thu, Mar 3 2016 10:42 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 PM

మెగాస్టార్ జుంబా డ్యాన్స్

మెగాస్టార్ జుంబా డ్యాన్స్

రాజకీయ రంగప్రవేశంతో సినిమాలకు దూరమైన మెగాస్టార్ చిరంజీవి, చాలా కాలంగా తన రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. త్వరలో తమిళ సూపర్ హిట్ సినిమా కత్తి రీమేక్తో రీ ఎంట్రీకి రెడీ అవుతున్న ఆయన తెర మీద అందంగా కనిపించడానికి అన్ని రకాలుగా కష్టపడుతున్నాడు. ఇప్పటికే చాలా వరకు బరువు తగ్గినా మరింత ఆకర్షణీయమైన లుక్ కోసం కొత్త తరహా డ్యాన్స్ ఫార్మ్ను ప్రాక్టీస్ చేస్తున్నాడు.
 
బెస్ట్ ఫిట్నెస్ డ్యాన్స్గా పేరున్న జుంబా డ్యాన్స్లో శిక్షణ తీసుకుంటున్నాడు మెగాస్టార్. లాటిన్ అమెరికాకు చెందిన ఈ డ్యాన్స్ను గంట పాటు చేస్తే శరీరంలో వంద క్యాలరీలకు పైగా కరిగించుకునే అవకాశం ఉందట. అందుకే చిరంజీవి తన 150వ సినిమా కోసం ఈ డ్యాన్స్ ఫార్మ్ను ఎంచుకున్నాడు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో చిరు ఎలా కనిపిస్తాడో అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎదురుచూస్తున్నారు.
 
విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన కత్తి సినిమాను చిరు వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను చిరంజీవి తనయుడు రామ్ చరణ్ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్తో కలిసి భారీ బడ్జెట్తో తెరకెక్కిండానికి ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement