చిరు హీరోయిన్ దొరికిందోచ్... | Chiranjeevi's 150th film Kattilantodu, Deepika Padukone in the lead role | Sakshi
Sakshi News home page

చిరు హీరోయిన్ దొరికిందోచ్...

Published Sat, Jun 4 2016 6:05 PM | Last Updated on Wed, Jul 25 2018 3:13 PM

చిరు హీరోయిన్ దొరికిందోచ్... - Sakshi

చిరు హీరోయిన్ దొరికిందోచ్...

మెగాస్టార్ చిరంజీవికి ఎట్టకేలకు హీరోయిన్ దొరికిందట. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరంజీవి 150వ సినిమా 'కత్తిలాంటోడు'లో ఆయనకు జోడీగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనె నటించనున్నట్లు సమాచారం. దీంతో హీరోయిన్ కోసం జరుగుతున్న కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లే. సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ హీరోగా  చిరంజీవి సిల్వర్ స్క్రీన్పై కనిపించబోతున్నారు.

దీంతో మెగా అభిమానులకు ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ  పబ్లిసిటీకి నోచుకున్న ఈ కత్తిలాంటోడు జోడీ కోసం కూడా అంతే ఊహాగానాలు సాగాయి. అనుష్క, నయనతార, త్రిష అంటూ పలు పేర్లు తెరమీదకు వచ్చినా చివరకు ఆ ఛాన్స్ దీపిక కొట్టేసింది. చిరంజీవి 150 సినిమాకు జోడీగా  దీపికను సంప్రదించామని, దీనికి ఆమె  ఓకే చెప్పినట్టు చిత్ర యూనిట్ తెలిపినట్లు భోగట్టా.

వీవీ వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో  సూపర్ హిట్ మూవీ 'కత్తి' ని  మెగాస్టార్ 150  సినిమాగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ చిత్రానికి ప్రాజెక్ట్  ప్రీ ప్రొడక్షన్ పని ఇప్పటికే మొదలుగాకా,  రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement