మెగాస్టార్ కోసం ఆర్ట్ డైరెక్టర్ స్పెషల్ సెట్ | Special jail set being erected for Chiranjeevi 150th film | Sakshi
Sakshi News home page

మెగాస్టార్ కోసం ఆర్ట్ డైరెక్టర్ స్పెషల్ సెట్

Published Wed, Jun 8 2016 12:50 PM | Last Updated on Mon, Sep 4 2017 2:00 AM

మెగాస్టార్ కోసం ఆర్ట్ డైరెక్టర్ స్పెషల్ సెట్

మెగాస్టార్ కోసం ఆర్ట్ డైరెక్టర్ స్పెషల్ సెట్

చెన్నై:  మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘ విరామం తర్వాత హీరోగా చేస్తున్న చిత్రం కత్తిలాంటోడు. అందులోనూ మెగాస్టార్ కు ఇది 150వ చిత్రం కావడంతో మూవీ యూనిట్ కూడా చాలా కేర్ ఫుల్ గా పని చేస్తోంది. చాలా ఏళ్ల తర్వాత తమ అభిమాన హీరో మూవీ చేస్తున్నారన్న కథనాలు వచ్చినప్పటి నుంచి అంచనాలు మరీ ఎక్కువయ్యాయి. కళా దర్శకుడు తోట తరణి ఈ మూవీలో కొన్ని సీన్ల కోసం స్పెషల్ గా జైలు సెట్ సిద్ధం చేస్తున్నాడు. మూవీలో ఫస్టాఫ్ లో కొన్ని సీన్లు జైల్లోనే తీయనున్నారు. చిరంజీవి, ఆయన తోటి ఖైదీలు కొందరు జైలు నుంచి పారిపోయే సీన్ ఏర్పాట్లలో మూవీ యూనిట్ బిజీబిజీగా ఉంది. అయితే హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమా ప్రధాన భాగం షూటింగ్ జరగనుంది.

చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్న ఈ మూవీకి మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. జూన్ చివరి వారంలో హైదరాబాద్ లో రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని మూవీ యూనిట్ చెప్పింది.వీవీ వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో విజయ్ నటించిన సూపర్ హిట్ మూవీ 'కత్తి' ని మెగాస్టార్ 150వ సినిమాగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement