150వ సినిమాకు హీరోయిన్ ఫైనల్?
Published Thu, Jan 7 2016 4:38 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమాలో ఆయనతో జతకట్టే హీరోయిన్ ఎవరో తేలిపోయింది. గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారిన ఈ అంశంలో ఎట్టకేలకు ఒకక్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. చిరంజీవి వయసుకు తగ్గట్టుగా అందాల భామ నయన తారను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దర్శకుడు వీవీ వినాయక్‌తో రెండు చిత్రాలు చేసిన నయన్ అయితేనే మెగాస్టార్ కు సరిజోడి అని సూచించినట్టు సమచారం. దీంతో ఈ క్రేజీ డైరెక్టర్ సూచనకు ఒకే చెప్పినట్టు సమాచారం. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి కొద్ది కాలం తరువాత తెరకెక్కుతున్న ఈ మూవీ టాలీవుడ్ భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే తమిళంలో హిట్టయిన ‘కత్తి' చిత్రాన్ని తెలుగులో చిరంజీవి 150వ సినిమాగా రీమేక్ చేస్తున్నారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా స్క్రిప్టులో మార్పులు, చేర్పులతో వివి వినాయక్ దర్శకత్వంలోఈ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి సరసన ఎవరు నటిస్తారు? అనేది చాలా కాలంగా ఉత్కంఠను రాజేసింది. సినిమా స్క్రిప్ట్ పూర్తి అయిందని, షెడ్యూల్ ఫిబ్రవరి లేదా మార్చి నుంచి ప్రారంభమవుతుందని వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ సినిమాను కొడుకు, టాలీవుడ్ యంగ్ హీరో రామ్‌చరణ్ ప్రొడ్యూస్ చేయనున్నాడు. ఈ సినిమాకోసం చిరు దాదాపు రోజూ జిమ్‌కు వెళ్తూ కసరత్తు చేస్తున్న సంగతి విదితమే.
Advertisement
Advertisement