
రంగంలోకి రైటర్
చిరంజీవి 151వ సినిమా పనులు మొదలయ్యాయి. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆ
చిరంజీవి 151వ సినిమా పనులు మొదలయ్యాయి. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. దీనికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తారు. కొత్త విషయం ఏంటంటే.. డీఎస్ కన్నన్ అనే రైటర్ రంగంలోకి దిగారు. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కి ఛాన్స్ దక్కడం కన్నన్‌కి సవాల్‌లాంటిదే.
ఇంకా ఎంతమంది రైటర్స్ ఈ ప్రాజెక్ట్‌కి పని చేయబోతున్నారనేది తెలియాల్సి ఉంది. ఇంతకీ ఈ కన్నన్ ఎవరంటే.. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం అజయ్ హీరోగా రూపొందిన ‘సారాయి వీర్రాజు’ ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆగస్ట్‌లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇందులో చిరు సరసన ఐశ్వర్యా రాయ్ కథానాయికగా నటిస్తారని టాక్.