చిరు పుట్టిన రోజున మెగా గిఫ్ట్ | Chiru 151 title logo launch on Chiranjeevi Birth day | Sakshi
Sakshi News home page

చిరు పుట్టిన రోజున మెగా గిఫ్ట్

Published Tue, Aug 15 2017 10:54 AM | Last Updated on Sun, Sep 17 2017 5:33 PM

చిరు పుట్టిన రోజున మెగా గిఫ్ట్

చిరు పుట్టిన రోజున మెగా గిఫ్ట్

ఖైదీ నంబర్ 150 సినిమాతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, తన నెక్ట్స్ సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్న విషయంపై మాత్రం ఎలాంటి వార్తా లేదు.

బాహుబలి 2 రిలీజ్ తరువాత చిరు 151 సినిమాను మరింత భారీగా నిర్మించాలని ప్లాన్ చేస్తున్న మెగా టీం అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది. మరోసారి చిరు తనయుడు రామ్ చరణ్ కొణిదల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ రూపొందించనున్నారు.

అందుకే ముందుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే టైటిల్ నిర్ణయించినా.. ఇప్పుడు అన్ని భాషల్లో ఒకే టైటిల్ ఉండాలన్న ఉద్దేశంతో మహావీర అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 22న ఈ సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందన్న ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement