పోటీ ఎప్పుడూ ఉంటుంది : కంగనా రనౌత్
పోటీ ఎప్పుడూ ఉంటుంది : కంగనా రనౌత్
Published Sat, Sep 28 2013 12:41 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
న్యూఢిల్లీ: బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్యే కాదు సిని మాల మధ్య కూడా పోటీ ఎప్పుడూ ఉంటుందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పేర్కొంది. కంగనా నటించిన ‘రజ్జో’ చిత్రం నవంబర్ 15న విడుదలకు సిద్ధమవుతోంది. సరిగ్గా అదే రోజు దీపికా పదుకొణె నటించిన ‘రామ్‌లీలా’ కూడా విడుదలవుతోంది. దీనిపై పాత్రికేయులు కంగనాతో మాట్లాడుతూ... ‘దీపిక సినిమాతో పోటీ పడుతున్నారా?’ అని అడిగిన ప్రశ్నకు కంగనా సమాధానమిస్తూ... ‘కథనాయకులు, నాయికల మధ్యేకాదు సినిమాల మధ్య కూడా పోటీ అనేది ఎప్పుడూ ఉంటోం ది.
అనుకున్న సమయానికే విడుదల చేస్తే ‘రామ్‌లీలా’లో నటిస్తున్న దీపికతో పోటీ పడుతున్నారా? అని ప్రశ్నిస్తున్నా రు. మరి ఓ వారం ముందు విడుదల చేస్తే హృతిక్ రోషన్‌తో పోటీ పడుతున్నా రా? అని అడుగుతారా?(నవంబర్ 3న క్రిష్-3 విడుదలవుతోంది) అని ఎదురు ప్రశ్నించింది. చిత్రా న్ని ఎప్పుడు విడుదల చేయాలనుకున్నా ఏదో ఒక సినిమాతో కలిసే విడుదల చేయాల్సి ఉంటుందని, పరిశ్రమ పరిధి, సినిమాలు నిర్మించే నిర్మాణ సంస్థలు, దర్శకులు, సాంకేతిక నిపుణుల సంఖ్య పెరిగిన తర్వాత తెరకెక్కుతున్న సినిమాల సంఖ్య కూడా పెరిగింది. దీంతో పోటీ తప్పడంలేదు.
ఇక సినిమా విషయానికి వస్తే ‘రజ్జో’ మహిళా ప్రాధాన్యమున్న చిత్రం కోవలోకి వస్తుంది. ఇందులో నేను ముజ్రావాలీ(వేశ్య) పాత్రలో నటిస్తున్నాను. నేనెంతో ఇష్టపడిన పాత్ర ఇది. ఇందులో నటించే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. నా నటన నన్నెంతగానో సంతృప్తిపర్చిం ది. పండుగల సీజన్‌లో విడుదల చేయడం మరింత ఆనందంగా ఉంది. నిర్మాతలు సరైన నిర్ణయమే తీసుకున్నార’ని చెప్పింది. ఇదిలాఉండగా చిత్రంలో కంగనాతోపాటు ప్రకాశ్‌రాజ్, మహేశ్ మంజ్రేకర్, జయప్రద, పరాస్ అరోరా నటిస్తున్నారు. ఫోర్ పిల్లర్స్ ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది.
Advertisement
Advertisement