దీపం ఉండగానే... | While in the house to repair the lamp | Sakshi
Sakshi News home page

దీపం ఉండగానే...

Published Tue, May 26 2015 12:27 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

దీపం ఉండగానే... - Sakshi

దీపం ఉండగానే...

ప్రస్తుతం హిందీ రంగంలో హాట్ టాపిక్స్ - రెండే రెండు సినిమాలు. ఒకటి ‘పీకూ’, రెండోది ‘తను వెడ్స్ మను రిటర్న్స్’. హీరోల సిక్స్ ప్యాక్స్, వారి ఫైట్స్ ఇవేమీ లేకుండా, మనసుకు హత్తుకునే సున్నితమైన కుటుంబ సంబంధాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాలు ఇటీవల విడుదలై ఘన విజయం సాధించాయి.
 
 ఈ సినిమాల్లో నటించిన దీపికా పదుకొనే, కంగనా రనౌత్‌ల పేర్లు ప్రస్తుతం బాలీవుడ్‌లో మారుమోగుతున్నాయి. ఈ సినిమాలు చూసినవాళ్లు ఎలాంటి పాత్రనైనా ఈ ముద్దుగుమ్మలు సునాయాసంగా చేసేస్తారని అక్కడివారు చెప్పుకుంటున్నారు. దాంతో నిర్మాతలు క్యూలు కడుతున్నారట. ఇంకేముంది? దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలని ఈ ఇద్దరూ అనుకుంటున్నారట.
 
 మార్కెట్లో తమకున్న క్రేజ్ దృష్ట్యా పారితోషికాలు పెంచారని భోగట్టా. విచిత్రం ఏంటంటే.. నిర్మాతలు కూడా దీపికా, కంగన అడిగినంత ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారని సమాచారం. హీరోలతో సంబంధం లేకుండా వీరి సినిమాలు వర్క్ అవుట్ అవుతుండటంతో మహిళా ప్రాధాన్య చిత్రాలు రూపొందించడానికి బాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement