బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ చిత్రపరిశ్రమలోని బంధుప్రీతి (నెపోటిజం)ని ఎండగడుతున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌లో అవార్డు ఫంక్షన్లు పక్షపాత రీతిలో ఎలా జరుగుతాయన్న విషయాలను ఆమె వెల్లడించారు. ముఖ్యంగా ఔట్‌సైడర్(ఇండస్ట్రీ పరిచయాలు లేకుండా బయట నుంచి వచ్చేవారి)తో ఎలా ప్రవర్తిస్తారన్న చేదు నిజాలను కుంబ బద్ధలు కొట్టి చెప్పారు. ఈ మేరకు ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. లండన్‌లో జరిగిన ఐఫా అవార్డుల ఫంక్షన్‌లో తనను అవమానించిన తీరు చూసి సుశాంత్ సింగ్ భయపడిపోయారని తెలిపారు. ఇప్పుడిప్పుడే నెపోటిజమ్ గురించి ప్రజలకు తెలుస్తూ వస్తోందని, కానీ అవార్డు ఫంక్షన్‌ల స్కాము గురించి ఎవరూ నోరు మెదపడం లేదని పేర్కొన్నారు. ప్రతిభను ఆధారంగా తీసుకోకుండానే బాలీవుడ్‌లో అవార్డులకు నామినేషన్లు, ఎంపిక జరుగుతాయని మండిపడ్డారు. (నేను బీ గ్రేడా?)
"హ్యాపీ న్యూ ఇయర్ సినిమాకు గానూ దీపిక పదుకొణేకు అవార్డు వచ్చింది. కానీ ఆమె తనకన్నా క్వీన్ సినిమాలో నటన బాగుందన్న విషయాన్ని అంగీకరించి అవార్డు తిరస్కరించింది. అయితే "గల్లీబాయ్"లో 10 నిమిషాలు కనిపించిన అలియాభట్ మాత్రం కొంచెం కూడా సిగ్గు లేకుండా అవార్డు అందుకుంది, సుశాంత్ సింగ్ "చిచోర్" సినిమాకు మాత్రం కనీస ప్రశంసలు దక్కలేదు. అతన్ని ఎదగనీయకుండా బాలీవుడ్ మాఫియా అణగదొక్కింది. "డ్రైవ్" చిత్రం సుశాంత్ కెరీర్‌ను నాశనం చేసింది. ఆ సినిమాను థియేటర్‌లో విడుదల చేసే సామర్థ్యం నిర్మాత కరణ్ జోహార్‌కు లేదంటే నేను నమ్మను. నిజానికి మహేశ్ భట్, కరణ్ జోహార్‌లపై కేసు పెట్టినా తప్పు లేదు. ఇది ఒక్క నా పోరాటమే కాదు. గొంతు ఉందని మర్చిపోయిన సమాజం కోసం నేను పోరాడుతున్నాను. జీవితంలో వెనక్కు తిరిగి చూసుకుంటే నేను చేయాలనుకుంది చేశాను అన్న తృప్తి ఉంటే చాల"ని చెప్పుకొచ్చారు. (అలా అయితే పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా : కంగన)
Comments
Please login to add a commentAdd a comment